Site icon NTV Telugu

Errabelli Dayakar Rao: కేంద్రం అవార్డులు ఇవ్వడం కాదు.. డబ్బులు ఇవ్వాలి

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

Errabelli Dayakar Rao: మిషన్ భగీరథ కు కేంద్రం అవార్డులు ఇస్తోంది.. అవార్డులు ఇవ్వడం కాదు.. మాకు డబ్బులు ఇవ్వాలి, కేంద్రం చాలా సార్లు మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ… అవార్డుల పంటతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే.. 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు నిధులు కూడా ఇవ్వాలని సూచించారు.

అంతేకాకుండా.. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణ మిషన్ భగీరథను కూడా తామే చేసినట్లు గొప్పగా చెప్పుకుంటుందని దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చినన్ని అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదని గుర్తు చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు.. ఆటంకాలు పెట్టినా అవార్డుల పంట పండుతోంది.. అన్ని శాఖల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉంది. అయితే.. అసెంబ్లీలో ఇవాళ నీళ్లు, కరెంట్ గురించి మాట్లాడే వ్యక్తి లేరన్నారు. ఇక, 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు, నిధులు కూడా ఇవ్వాలని అన్నారు. నిధుల విషయంలో కేంద్రం తెలంగాణను మోసం చేస్తోందని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావ్‌.
RBI-Card Tokenisation: రిజర్వ్‌డ్‌గా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌. కార్డ్‌ టోకెనైజేషన్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు?

Exit mobile version