NTV Telugu Site icon

Uttam Kumar Reddy: కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారనే భ్రమలో ఉన్నారు.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttamkumar reddy: మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని భ్రమలో ఉన్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా జాన్ పాడ్ దర్గా ఉర్స్ లో ఆయన పాల్గొన్నారు. స్వామివారికి గంధం సమర్పించారు. జాన్ పాడ్ దర్గా ఊర్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత పది సంవత్సరాలుగా అభివృధి శూన్యమని తెలిపారు. సాగర్ డ్యాంలో నీరు తక్కువ ఉంది.. ఈసారి వర్షాలు సంవృద్దిగా పడాలని దర్గాలో ప్రార్థనలు చేశా అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టీ.. నిధులు దోచుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ పేరుతో డబ్బులు దుర్వినియోగం చేశారన్నారు. మిషన్ భగీరథ సక్సస్ అయితే కృష్ట నది ఒడ్డున ఉన్న గ్రామాలకు తాగు నీరు ఎందుకు రాలేదన్నారు. 25 గంటల కరెంటు అనేది రికార్డ్ ల్లో అంతా బూటకం అనీ తెలిసిందన్నారు. మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని భ్రమలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బై బై కేసీఆర్.. బై బై కేటీఆర్ ఇదే రాసి పెట్టుకోండి అంటూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read also: Kanguva: “ఉధిరన్”గా మారనున్న అనిమల్ అబ్రార్…

సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.7 వేల 500 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు పండాలని ఆకాంక్షించారు.గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. గత ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దర్గాకు వచ్చే భక్తుల కోసం కోట్లాది రూపాయలతో అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మిషన్‌ భగీరథ ద్వారా 40 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చి కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వకుండా 90 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. తాగునీటి కోసం సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

Show comments