Srinivas Goud: ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూములు ఇష్టానుసారంగా అనర్హులకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిపై సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. వేయి కోట్ల విలువైన భూములను రిటర్న్ తీసుకున్నామని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గోల్ఫ్ కోర్ట్ అభివృద్ధి చెస్తామని 120 ఎకరాలు తీసుకున్నారని ఆరోపించారు. కానీ గోల్ఫ్ ను అభివృద్ధి చేయకుండా ఇతర పనులకు ఉపయోగిస్తున్నారని అన్నారు.
Read also: Arvind Kejriwal: దేశం కోసం ప్రాణమైనా ఇస్తా.. సీబీఐ 100 సార్లు పిలిచినా సమాధానమిస్తా..
దానిని టూరిజం డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుందని అన్నారు. యాత్రినివాస్ దగ్గర 100 కోట్ల విలువైన భూమిని కూడా తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్న భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. లీజ్ అమౌంట్ పే చేయని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నమని అన్నారు. ప్రభుత్వ భూములను ఇతర కార్యకలాపాలకు ఉపయోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని అన్నారు.
Brown Rice: రోజూ బ్రౌన్ రైస్ తింటే పొట్ట తగ్గుతుందా? నిజమెంత?
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన తేదీల ఆధారంగా నీరా కేఫ్ ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో ఎక్సైజ్, టూరిజం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించనున్న నీరా కేఫ్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు. దేశంలోనే తొలి ఆధునిక నీరా కేఫ్ లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని నీరా కేఫ్‌ను ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామన్నారు.
Fire Accident : దుబాయ్ లో అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులతో పాటు 16 మంది మృతి