Site icon NTV Telugu

Minister Seethakka : మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండు

Seethakka

Seethakka

మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చిండని, ఉద్యోగాలు అడిగితే రాముని అక్షింతలు పంపించిండన్నారు మంత్రి సీతక్క. ఆదానీ- అంబానీ రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పనిచేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే.. దేవుళ్ళ పేర్లు చెప్తున్నారు.. మన ఊర్లు అందరికి దేవుళ్ళు ఉన్నారని, గాంధీని చంపిన గాడ్సే కు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ పార్టీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీ కరోనా సమయంలో ఎవరికి సహాయం చేయలేదని, నల్లధనం తీసుకువస్తా అన్నడు, ప్రతి ఎకౌంటు లో పదిహేను లక్షల రూపాయల వేస్తా అన్నాడన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే దండుగా.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాలేదన్నారు మంత్రి సీతక్క.

PM Modi: కీలమైన ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్.. ఆ పార్టీని నమ్మలేం..

సామాన్యురాలైన అత్రం సుగుణక్కకు టిక్కెట్ వచ్చింది, అడబిడ్డను పార్లమెంటు కు పంపుదామన్నారు సీతక్క. ఆరు లక్షల కోట్ల అప్పు ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము, 200 యూనిట్లు కరెంటు ఇస్తున్నం, 500 కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామని, మూడు నెలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. పదహేరు వేల కోట్ల రూపాయల మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని, ఆదిలాబాదు జిల్లా ను అభివృద్ధి చేసే బాధ్యత నాదే, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇంచార్జ్ గా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ గారి పర్యాటక ఆదిలాబాదు జిల్లా లో ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Palvancha Rural Police: పాల్వంచ పోలీసులు నయా రూల్స్‌.. ట్రాక్టర్‌ కు సీటు బెల్ట్‌ లేదని జరిమానా..!

Exit mobile version