Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్‌పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
- ఎల్ నీనో ప్రభావంపై మిషన్ భగీరథకు హెచ్చరిక
- 100 రోజుల కార్యాచరణ.. ప్రతి 15 రోజులకు సమీక్ష
- పైప్ లీకేజీలు, నీటి సమస్యలపై ముందస్తు చర్యలు
- గిరిజన తండాలకు ప్రత్యేక ప్రణాళికలు.. జలసిరికి ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : దేశవ్యాప్తంగా ఎల్ నీనో (El Niño) పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాబోయే వేసవి పరిస్థితులు , నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాబోయే వంద రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, నీటి సరఫరాపై ప్రతి 15 రోజులకు ఒకసారి తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. విధుల పట్ల అశ్రద్ధ లేదా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
16వ ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యామ్నాయ చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. గ్రామాల్లో ఎక్కడైనా అత్యవసరంగా తాగునీటి సమస్య తలెత్తితే 16వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక నీటి వనరులను (Local Sources) మరింత మెరుగుపరచాలని, నిరుపయోగంగా ఉన్న బోర్‌వెల్స్‌కు వెంటనే మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలున్న గ్రామాలను గుర్తించి, వారం రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
పైప్ లీకేజీలు ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలి
మండలాల వారీగా అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని, ఎక్కడా సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఏదైనా పైప్‌లైన్ లీకేజీలు లేదా రిపేర్ల కారణంగా ఒక రోజు నీటి సరఫరా నిలిచిపోతే, ఆ విషయాన్ని గ్రామస్తులకు ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. దీనివల్ల ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఎల్ నీనో తీవ్రత దృష్ట్యా మిషన్ భగీరథ ఇంజనీర్లు , అసిస్టెంట్ ఇంజనీర్లు (AE) మరింత జవాబుదారీతనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి.. జలసిరి విజయవంతం కావాలి
మిషన్ భగీరథతో ఇంకా అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో ఏఈలు స్వయంగా పర్యటించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సీతక్క ఆదేశించారు. ప్రతి మండలంలో ఏఈలు స్థానిక సర్పంచ్‌లతో సమావేశమై మంచినీటి సరఫరా తీరుపై సమీక్షించాలని చెప్పారు. గతంలో కూడా ఎల్ నీనో పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేసి నీటి ఎద్దడి లేకుండా చూశామని, ఇప్పుడు కూడా అదే పట్టుదలతో పనిచేయాలని కోరారు. “జలసిరి” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వర్షపు నీటిలోని ప్రతి బొట్టునూ ఒడిసిపడితే భవిష్యత్తులో ఇలాంటి తాగునీటి సమస్యలను శాశ్వతంగా అధిగమించవచ్చని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?