Site icon NTV Telugu

Minister Seethakka : డ్రగ్స్‌ రాష్ట్రాన్ని కబళించకుండా అందరం కృషి చేయాలి

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka : తెలంగాణలో డ్రగ్స్‌ వ్యసనం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, నేషనల్ ఆంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అనే వ్యాధి యువతను భయంకరంగా పీడిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వినిపించే సమస్య. ఇప్పుడు మాత్రం స్కూల్ల దాకా ప్రవేశించింది. చాక్లెట్లు, బిస్కెట్లు రూపంలో పిల్లలకు చేరుతోంది. ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి,” అని సీతక్క అన్నారు. డ్రగ్స్‌ను వ్యాపారంగా మార్చిన కొంతమంది, లాభాల కోసం సమాజాన్ని మత్తులోకి లాగుతున్నారన్నారు.

Pawan Kalyan: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై పవన్‌ కల్యాణ్‌ ఛలోక్తులు!

డ్రగ్స్‌కు బానిసలైన విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు బాధను మిగులుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఇలాంటి వారిని సొసైటీ కూడా తిరస్కరించే అవకాశం ఉంది. ఇది కేవలం వారి జీవితమే కాదు – సమాజానికే ప్రమాదం” అని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వాడకం మూలంగా చిన్నారులపై అత్యాచారాలు, వృద్ధులు ఆడపిల్లలపై రేపులు, హత్యలు వంటి దారుణాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. “ఇది నేరం మాత్రమే కాదు, మానవత్వాన్ని మరిచే స్థితి,” అని అన్నారు.

ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నదని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చాలనే లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. “ప్రతి ఒక్కరూ బాధ్యతగా మత్తుపదార్థాలను తిరస్కరించి, డ్రగ్స్ నిర్మూలన కోసం కృషి చేయాలి” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ శాఖకు, కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. డ్రగ్స్ వంటి ముప్పుల నుంచి సమాజాన్ని రక్షించాలంటే, ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని అన్నారు.

Jani Master : జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో

Exit mobile version