Site icon NTV Telugu

Sabitha Indra Reddy: విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయండి..

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

శుక్రవారం నుండి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని, కష్టపడి చదివిన విద్యార్థులు ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి ఆకాక్షించారు. విద్యార్థులెవరూ భయానికి, ఆందోళనకు గురికావద్దు అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,393 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

Read Also: Union minister Danve: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లో తీవ్రస్థాయిలో కులతత్వం..!

కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు వార్షిక పరీక్షలను నిర్వహించుకోలేకపోయం.. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల సందర్భంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు మంత్రి సబిత.. ఇక, విద్యార్థుల సౌకర్యార్థం 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతోందని, ప్రశ్నల ఛాయిస్ పెంచడం జరిగిందని తెలిపిన ఆమె.. వేసవి కాలం దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని.. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయలని పేర్కొన్నారు.

విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా విద్యార్థులు తల్లిదండ్రులుసహకరించాలి సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులెవరైనా మానసిక వత్తిడికి గురైతే.. ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005999333కు ఫోన్ చేసి విలువైన సలహాలు పొందవచ్చు అని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Exit mobile version