NTV Telugu Site icon

Sabita Indraredy: బీజేపీ పల్లెప్రగతిని రాంగ్ రూట్లో తీసుకెళ్లొద్దు

Sabita Indrareddy 1280x720

Sabita Indrareddy 1280x720

తెలంగాణలో పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గ్రాామాల్ల పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లిచడం లేదని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని.. అయినా సర్పంచులకు బిల్లులను దాదాపుగా క్లియర్ చేశామని, మిగతావి త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రులు చెబుతున్నారు.

ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లవద్దని బీజేపీ పార్టీకి హితవు పలికారు. ప్రతి దాంట్లో మా వాటా ఉందని చెప్పే బీజేపీ అధ్యక్షుడు.. ఇప్పుడు గ్రామాలకు నిధులు ఇవ్వండంటూ అడగడం ఏంటని ప్రశ్నించారు. ద్వంద్వ నీతితో ఉన్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుంచి 15 రోజుల పాటు కొనసాగుతాయని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలసని ఆమె అన్నారు. దేశంలో అత్యుత్తమ సంసద్ గ్రామాలు 10 తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని అన్నారు.

రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు రూ.335 కోట్ల నిధులు విడుదల చేశామని.. ఇంకా రూ. 14 కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జూన్ 3 నుంచి పల్లె ప్రగతిలో భాగంగా బడిబాట కూడా ఉంటుందని తెలిపారు. ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేయబోతున్నామని.. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు.

Show comments