Site icon NTV Telugu

Puvvada Ajay: రేవంత్‌కు పువ్వాడ కౌంటర్‌.. నువ్వా నా గురించి మాట్లాడేది..?

Puvvada Ajay

Puvvada Ajay

ఖమ్మంలో పర్యటించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. మంత్రి పువ్వాడ అజయ్‌పై విరుచుకుపడ్డారు.. ఆయనపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు.. ఇక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రేణుకాచౌదరి కూడా పువ్వాడను టార్గెట్‌ చేశారు.. అయితే, రేవంత్‌, రేణుకాకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్.. రేవంత్ రెడ్డి ఒక ఐటమ్‌గా పేర్కొన్న ఆయన.. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పోటీచేసిన సందర్భంలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు వదిలి పెడతా అని చెప్పాడు.. ముందు ఆ ఛాలెంజ్ కు కట్టుబడి ఉండు.. ఆ తర్వాత మిగతా ఛాలెంజ్‌ల గురించి ఆలోచిద్దాం అంటూ కౌంటర్‌ ఇచ్చారు.. మమతా ఆస్పత్రిపై విచారణ చేయాలని గవర్నర్ కు రేవంత్ ఫిర్యాదు చేశాడు… మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు..
గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు.. మమతా ఆస్పత్రి జనతా ఆస్పత్రి అని ఖమ్మం ప్రజలకు తెలుసన్నారు.

Read Also: SAGY: ఆదర్శ గ్రామాలు.. టాప్‌ 10లో మొత్తం తెలంగాణ గ్రామాలే..

ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చావు అంటూ రేవంత్‌పై ఫైర్‌ అయిన అజయ్.. నువ్వా నా గురించి మాట్లాడేది.. మ్యాచ్ ఫిక్సింగ్ లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడు.. సుఫారి ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, రేణుక చౌదరికి ఒక్కరు రావాలంటే భయం అందుకే రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చారని సెటైర్లు వేశారు మంత్రి పువ్వాడ.. రేణుక చౌదరి బతుకే డ్రగ్స్‌, పబ్బు, క్లబ్బు.. ఆమె గురించి ఖమ్మం ప్రజలకు తెలుసన్న ఆయన.. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మంకు రేణుక చౌదరి చేసిందేమిటి..? అని నిలదీశారు. నన్ను చిత్తు చిత్తుగా ఒడిస్తా అంటున్నారు రండి.. చూసుకుందాం అంటూ సవాల్‌ చేశారు అజయ్‌ కుమార్.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారిన సాయి గణేష్ ఘనపై ఈ నెల 29వ తేదీ తర్వాత మాట్లాడుతానని వెల్లడించారు.. కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌.

Exit mobile version