Site icon NTV Telugu

Minister Puvvada Ajay : అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారు

Puvvada Ajay

Puvvada Ajay

ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో.. కారణం మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అంటూ.. బీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. తాజాగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. జిల్లా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని అగ్రహం వ్యక్తం చేశారు. ‘రఘునాథపాలెం మండలంలో మల్లెమడుగు గ్రామమే లేకపోగా.. నాకు ఈ గ్రామంలో 32ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని వారికి సవాల్‌ చేస్తున్నా.. ఒక్క ఎకరం భూమి ఉందని నిరూపించినా ఇక్కడిక్కడే పేదలకు రాసిస్తా’ అని వెల్లడించారు.

‘రాజకీయాల్లోకి రాక ముందే నేను బెంజ్‌ కారులో తిరిగా… కానీ ఇప్పుడు పార్చునర్‌ కారుకు వచ్చింది పరిస్థితి. వచ్చే ఎన్నికల తర్వాత అంబాడిసర్‌ కారుకో పోతదో, స్కూటర్‌కు పోతదో తెల్వదు’ అని పేర్కొన్నారు. అయితే, తనను ఎంత టార్గెట్‌ చేస్తే అంత వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తానని స్పష్టం చేశారు. ఒకరికి ఇచ్చే వాడినే తప్ప పుచ్చుకునే వాడిని కాదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరికి ఫ్యూజ్‌లు ఎగిరిపోతున్నాయని ఎద్దేవా చేశారు మంత్ర పువ్వాడ.

Exit mobile version