Ponnam Prabhakar: కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మార్కెట్ రోడ్ లో వద్ద కొలువై వున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈసారి అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. మాజీ మంత్రి గంగుల కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ కూడా ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. స్వామివారి వేడుకలను అత్యంత పారదర్శకంగా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. దాతలు ఇచ్చిన ప్రతీ రూపాయికి లెక్క చెబుతామని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు నా తరపున 5 లక్షల విరాళం ప్రకటిస్తున్నామన్నారు.
Read also: Joram : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మనోజ్ బాజ్‍పేయ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘జోరమ్’..
మెదక్ జిల్లా తుప్రాన్ లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని బీసీ సంఘాలు 33 జిల్లాల్లో పర్యటించి బీసీ జనాభా గణనకు చేపట్టాల్సిన అంశాలను వివరించాలన్నారు. కాంగ్రెస్‌తోనే బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. బీసీల కోసం పనిచేస్తున్న ప్రతి సంఘం తప్పకుండా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో లాగా బిసిలను మోసం చేయొద్దని, చిత్తశుద్ధితో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Nirmala Sitaraman : ప్రైవేట్ పరం కానున్న ఎస్బీఐ, ఓఎన్జీసీ.. ఆర్థికమంత్రి ఏం చెప్పారంటే ?