Ponnam Prabhakar: ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలోని కాంగ్రేస్ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టనున్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రకటించారు. కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల చూపిన వివక్ష, విభజన హామీల అమలులో బీజేపీ తీరుకు నిరసనగా దీక్ష చేయనున్నారు. ఆవిధంగానే రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. గత రెండు రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Read also: Vijayasai Reddy: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య
బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినా విభజన హామీలను విస్మరించిందని, దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టనున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనకు సూటిగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విభజన హామీలను విస్మరించిన బీజేపీకి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగుతుందోనని, ఆ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారని విమర్శించారు.
Read also: Iran Vs Israel: ఇజ్రాయెల్‌పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి..
ప్రతి ఇంటికి రాముడు, అక్షింతల ఫొటోలు పంపడం తప్ప ప్రతి ఇంటికి ఏం చేశారో చెప్పాలని, వీలైతే బీజేపీకి రాముడి బొమ్మ కాకుండా మోదీ బొమ్మతో ఓట్లు అడగాలని పొన్నం సవాల్ విసిరారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తమ నియోజకవర్గాల్లో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ దీక్షా ప్రకటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ ఏం చేశారో, ఇప్పుడు ఎందుకు దీక్ష చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని పొన్నంకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
Iran Vs Israel: ఇజ్రాయెల్‌పై రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి..