NTV Telugu Site icon

Minister Niranjan Reddy: వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పా..?

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు వరదలు ముంచెత్తాయి. దీంతో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా.. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని నిరంజన్‌ రెడ్డి గుర్తుచేశారు. ఎవ్వరైనా సరే ఎంత అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కృష్ణా నదిపై మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయని నిరంజన్​రెడ్డి అన్నారు. వరదల వల్ల కాళేశ్వరం పంప్‌హౌస్‌లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని నిరంజన్‌ రెడ్డి తప్పుబట్టారు. గతంలో చాలా సార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాని, ప్రాజెక్టు ఇంజినీర్‌ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.

read also: poonam kaur: సీఎంను కలిసిన పూనమ్ కౌర్

ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును నెహ్రూ కట్టారంటారు. అంతేకాదు.. శ్రీశైలం ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి కట్టారంటారు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వైఎస్ఆర్‌ కట్టారంటారు మంచిగానే వుంది. మరి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ గురించి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. నీరు ఎక్కువగా వున్నా చోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, ఇంజినీరింగ్ మహాద్భుతం అని ప్రపంచం కీర్తిస్తోందని అన్నారు. కాగా.. 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా కాళేశ్వరం నిర్మాణం. అంతేకాదు.. సాంకేతికంగా ఏ లోపం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గుర్తు చేసారు. వరదతో పంప్‌హౌస్‌లు మునిగిపోతే ప్రభుత్వానిది తప్పంటారా? అంటూ ప్రశ్నించారు. అయితే.. 1998, 2009 లో శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోలేదా? అంటూ ప్రశ్నించారు. నీటిరంగ నిపుణుడు పెంటారెడ్డిని అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పెంటారెడ్డి డిజైన్ చేసిన ప్రాజెక్టులు కట్టలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవిషయాన్ని గుర్తుచేసారు మంత్రి.. ప్రాజెక్టులు నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లో కట్టాలి.. కానీ జూరాల ప్రాజెక్టును నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లోనే కట్టారా అని ప్రశ్నించారు. మరి.. నీటిలభ్యత ఉన్న దగ్గర పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కడుతుంటే అటంకాలు కలిగించడం ఎంత వరకు సమంజసం మంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు లేనిపోని ఆరోపణలు చేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై 180 కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంతమంది ఏరకంగా అయినా ప్రాజెక్టు పనులను అడ్డుకున్నా ఏడాదిన్నరలోపు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆయన ఛాలెంజ్‌ చేశారు.
Bandi Sanjay Fires on KCR: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేసిండు