NTV Telugu Site icon

Minister Malla Reddy: స్టిక్కర్‌ నాదే కానీ.. దాంతో నాకు సంబందం లేదు..!

Minister Malla Reddy

Minister Malla Reddy

క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉండటం సంచలనంగా మారింది. దీంతో.. మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్‌ నాదే కానీ.. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నగరంలోని బోడుప్పల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే.. మాధవ రెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ తనదేనన్న మల్లారెడ్డి, అది 2022 మార్చి నాటిదని చెప్పారు. ఈనేపథ్యంలో.. మూడు నెలల క్రితమే దాన్ని తీసి బయటపడేశామని స్పష్టం చేసారు. దానిని ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని ఆయన మండిపడ్డారు.

read also: Tirumala: టీటీడీ కీలక నిర్ణయం .. అప్పుడు సర్వదర్శన భక్తులకే అనుమతి

అయితే ఇదిఇలా వుంటే.. క్యాసినో కేసులో దర్యాప్తులో భాగంగా చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన విసయం తెలిసిందే.. కాగా.. దర్యాప్తులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు వారిద్దరితో టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో.. తనిఖీల్లో భాగంగా ఈడీ అధికారులు మాధవరెడ్డి వాడుతున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంట్లో నిర్ఘాంతపోయేలే విషయం బయటకు వచ్చిది. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ వుండటం అదికూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా వుండటంతో.. ఈ కేసు కాస్త సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో.. మాధవరెడ్డికి మంత్రి మల్లారెడ్డితో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో.. మంత్రి మల్లారెడ్డి స్పందించి తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.