Site icon NTV Telugu

Minister Malla Reddy : మేము ట్రెండ్ ఫాలో కాము.. సెట్‌ చేస్తం..

Minister Mallareddy Speaks About BJP and Congress at Telangana Assembly Meetings 2022.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి నవ్వులు పూయించారు. మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన వ్యాఖ్యాలకు సభంతా నవ్వులమయంగా మారింది. మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేము ట్రెండ్ ఫాలో కాము.. ట్రెండ్ సెట్టర్ లం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వెనక్కి తగ్గేదే లేదు.. అక్కడ చంద్రుడు… ఇక్కడ తారక రాముడు.. ఢిల్లీ పెద్దలు రామా అనుకుంటున్నారు అంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మల్లారెడ్డి ప్రసంగం విన్న మంత్రులు పడి పడి నవ్వారు. కాంగ్రెస్.. బీజేపీ అన్నదమ్ముల్లా లెక్కనే అని ఆయన అన్నారు. భట్టి నువ్వు మధిర మధిర అంటున్నావు.. తెలంగాణ అంతా తిరగాలి.. ప్రతిపక్ష నాయకుడిగా మధిర కె పోకు అంటూ కాంగ్రెస్‌ నేతలకు కూడా చురకలు అంటించారు.

మాది అంతా ఆన్లైన్.. మీది అంతా ఆఫ్లైన్.. కేటీఆర్ టీఎస్‌ ఐపాస్.. నాది ఫ్యాక్టరీ ఐ పాస్.. కార్మిక శాఖ అంటే తక్కువ అంచనా వేస్తున్నారు నన్ను అంటూ ఆయన అన్నారు. 1500 కోట్లు ఎఫ్‌డీ ల రూపంలో ఉంటాయి నా దగ్గర అని ఆయన మాట్లాడారు. అంతేకాకుండా కేటీఆర్..హరీష్ లనే ప్రశ్నలు అడగడం కాదు.. నన్ను కూడా అడగాలి భట్టి అన్నా.. నన్ను కూడా నాలుగు ప్రశ్నలు అడుగు అంటూ అందరినీ నవ్వించారు.

Exit mobile version