NTV Telugu Site icon

KTR Tour: నేడు వరంగల్‌కు మంత్రి కేటీఆర్..

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలను చుట్టేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఇవాళ వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.. వచ్చే నెలలో రాహుల్‌ గాంధీ పర్యటన, కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ జరగనుండగా… అంతకు ముందు కేటీఆర్‌ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. ఇక, కేటీఆర్‌ పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల్లో.. టి.పీసీసీ నేతలు వరంగల్‌లో పర్యటించి రాహుల్‌ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్న విషయం తెలిసిందే. కేటీఆర్‌ ఇవాళ్టి వరంగల్, హనుమకొండ, నర్సంపేట పర్యటనల్లో 236 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఎటు చూసినా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓరుగల్లు గులాబీమయంగా మారిపోయింది.

కేటీఆర్ ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనకు సంబంధించిన టూర్ షెడ్యూల్‌ ఇలా ఉంది..
* ఉదయం 9.15 గంటలకు వరంగల్ ఆర్ట్, సైన్స్ ప్రాంగణానికి చేరుకోనున్న కేటీఆర్..
* ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
* ఉదయం 10.10 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 ప్రారంభోత్సవం
* ఉదయం 10.20 నుంచి 10.30 గంటల వరకు రీజినల్ గ్రంథాలయం ప్రారంభం
* ఉదయం 10.40 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 ప్రారంభం
* ఉదయం 10.50 నుంచి 11.20 గంటల వరకు పబ్లిక్ గార్డెన్లో చేపట్టిన వివిధ పనుల ప్రారంభం
* ఉదయం 11.30 గంటలకు హెలీక్యాప్టర్‌లో నర్సంపేట బయల్దేరనున్న కేటీఆర్..
* మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు చేరుకోనున్న మంత్రి..
* మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 వరకు నర్సంపేట మునిసిపాలిటీ కార్యాలయంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
* మధ్యాహ్నం 12.30 నుంచి 12.40 గంటల వరకు అశోక్ నగర్‌లో పైపుల ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభం
* మధ్యాహ్నం 12.40 నుంచి 1.30 వరకు బైపాస్ రోడ్డులో బహిరంగ సమావేశం
* మధ్యాహ్నం 1.30 గంటలకు నర్సంపేట నుంచి ఆర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు .
* మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటిలో భోజనాలు
* మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు హన్మకొండ కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై రివ్యూ
* సాయంత్రం 4 నుంచి 4.20 గంటల వరకు సర్యూట్ గెస్ట్ హౌజ్ సమీపంలోని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటిలో టీ బ్రేక్
* సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్
* సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరనున్న మంత్రి కేటీఆర్.