KTR: నేడు ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం పట్టణంతోపాటు నియోజకవర్గంలో నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
అనంతరం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగిస్తారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఇప్పటికే అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు.
పర్యటన వివరాలుః
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ఉదయం 9 గంటలకు మంత్రి కేటీఆర్ హెలికాప్టర్లో ఖమ్మం పట్టణానికి చేరుకుంటారు. 9.15 గంటలకు లకారం చెరువుపై రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటేన్, ఎల్ఈడీ లైటింగ్‌ను జాతికి అంకితం చేస్తారు.
ఉదయం 9.45గంటలకు రఘునాథపాలెంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్, బృహత్ పల్లెప్రకృతివనం ప్రారంభిస్తారు.
ఉదయం 10.15 గంటలకు టేకులపల్లిలో 240 డబుల్ బెడ్రూం ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు.
10.45 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం పాత మున్సిపల్ కార్యాలయంలో సిటి లైబ్రరీ, ఐటీ హబ్ సర్కిల్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిర్మించిన ఫుట్‌పాత్, దానవాయిగూడెంలో ఎఫ్ఎస్టీపీ, ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనివాస్‌నగర్‌లో మానవ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభిస్తారు.
City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!