పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు కేటీఆర్. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని రెడ్డి సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 11.30 నిమిషాలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో సమావేశమవుతారు. 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్ మండలంలో యాదవ సంఘ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
LIVE : మీ ఆర్థిక సమస్యలు పోయి ధనవంతులవ్వాలంటే ఈ స్తోత్ర పారాయణం తప్పనిసరిగా చేయండి
