Site icon NTV Telugu

Minister KTR Thanks to PM Modi: ప్రధాని మోడీకి ధ్యాక్స్‌ చెప్పిన కేటీఆర్‌..

Minister Ktr Thanks To Pm Modi

Minister Ktr Thanks To Pm Modi

ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ ధ్యాంక్స్‌ అంటూ ట్వీట్‌ చేసారు. ఎప్పుడు బీజేపీపై ప్రశ్నల వర్షం, మండిపడే కేటీఆర్‌ థ్యాంక్స్‌ చెప్పడమేంటని చర్చనీయాంశంగా మారింది. అయితే కేటీఆర్‌ ప్రధానికి థ్యాంక్స్‌ అంటూ సెటైర్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌ . అయితే.. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్‌ వేసారు. అంతేకాకుండా.. దేశాన్ని నడుపుతున్న డబుల్‌ ఇంజిన్‌ మోదీ.. ఈడీ అని దీంతో అర్థమవుతున్నదని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వ్యగ్యంగా విమర్శించారు.

ఈనేపథ్యంలో.. సీనియర్‌ సిటిజన్లుతో పాటు.. జర్నిలిస్టులకు, విధ్యార్థులకు ఊహించని షాక్‌ ఇచ్చింది రైల్వేశాఖ. టికెట్‌ ధరపై సీనియర్‌ సిటిజన్లకు ఇస్తున్న రాయితీ కట్‌ చేయడమేకాకుండా.. విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను మంగళం పాడింది. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్‌ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి, సబ్సీడీలను తిరిగి పునరుద్దరించే అవకాశం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో స్పదించిన మంత్రి కేటీఆర్‌.. రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఎత్తివేత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. అయితే.. రాయితీ ఎత్తివేయాలన్న నిర్ణయం బాధాకరమని అన్నారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతే కాదు.. విధి కూడా అంటూ కేంద్ర మంత్రికి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఈనేపథ్యంలో.. దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తమ హయాంలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Exit mobile version