Site icon NTV Telugu

Minister KTR : కేసీఆర్ చొరవతో నల్లగొండ రూపురేఖలు మారిపోయాయి

Minister Ktr

Minister Ktr

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్ చొరవతో నల్లగొండ రూపురేఖలు మారిపోయాయన్నారు. 13వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసామని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం మరింత వెనుకబడేదన్నారు. కాంగ్రెస్ నేతలు మంత్రిగా ఉంది చేయలేని పనులు ఎమ్మెల్యే గా ఉందడీ భూపాల్ రెడ్డి చేసాడని ఆయన అన్నారు. 24గంటల కరెంట్ పై అనుమానం ఉంటే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చిన చోట, ఇష్టం వచ్చినప్పుడు కరెంట్ తీగలు పట్టుకోవచ్చని ఆయన అన్నారు. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అడ్డుకున్న ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అని, ఫ్లోరోసిస్ పారద్రోలిన మొనగాడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Narendra Modi : రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్‌ ఇలా..!

అంతేకాకుండా.. ‘స్వయంగా ప్రధాని ఈ విషయాన్ని పార్లమెంట్ లొనే ఒప్పుకున్నాడు. రైతు రుణమాఫీ విషయంలో ప్రధాని పచ్చి అబద్ధం చెప్తున్నారు.. బీజేపీ మాతవిద్వేషాలు రెచ్చగొడుతుంది.. స్వయంగా పార్లమెంట్ లోకూడా ఈ వివక్ష కొనసాగుతుంది.. దేశంలో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. తెలంగాణలో మతసమరస్యం కాపాడుతాము. కాంగ్రెస్ ను నమ్మితే 3 గ్యారంటీలు తప్పనిసరిగా వస్తాయి. కాంగ్రెస్ కు మళ్ళీ అధికారం ఇస్తే కరెంట్ కష్టాలు తప్పవు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి రావడం ఖాయం.. కుంభకోణాలు గ్యారంటీ.. వారంటి లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలను నమ్మొద్దు. కాంగ్రెస్ డేంజర్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు..’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Also Read : TDP Deeksha: దీక్ష విరమించిన టీడీపీ నేతలు.. లోకేష్, భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version