NTV Telugu Site icon

Minister KTR : హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. వచ్చే జనవరి చివరి నాటికి నాలా పనులు పూర్తి

Ktr

Ktr

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మంగళవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా పచ్చదనం కనిపిస్తోందని అన్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఊకదంపుడు ఉపన్యాసాలు, చిత్ర విచిత్ర బట్టలు వేసుకుంటే అభివృద్ది కాలేదని, కేసీఆర్ ముందుచూపు, చిత్తశుద్దితో డెవలప్ మెంట్ సాధ్యం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. 240 కోట్ల మొక్కలతో రాష్ట్రమంతా హరితహారం, రాష్ట్రంలో 7.7 శాతం వృద్దితో 31.7 శాతం గ్రీన్ కవర్ అయిందని ఆయన వెల్లడించారు.
Also Read : Rains Alert: ఏపీలో మూడు రోజుల భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
నాలా పనులు వచ్చే జనవరి చివరి నాటికి పూర్తి అవుతాయని ఆయన తెలిపారు. వర్షం కాలం నాటికి మొదటి దశ నాలా పనులు మొత్తం పూర్తి చేసి ముంపు సమస్య తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. మళ్లీ తిరిగి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో ఎలాగో కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత మెట్రో రెండో ఫేజ్ కింద నాగోల్ టూ ఎల్బీ నగర్ లైన్ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోరైలు తీసుకువస్తామని, వచ్చే ఎన్నికల తర్వాత హయత్ నగర్ వరకు మెట్రో తీసుకు వస్తామన్నారు.

Show comments