NTV Telugu Site icon

KTR: మోడీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మొన్న చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇప్పుడు చూపిస్తాం..!

Ktr

Ktr

KTR: ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని ప్రసంగించారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌ ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ రూ.5కోట్లు తీసుకువచ్చాడని.. అభ్యర్థులు ఆగమై తనకు ఫోన్లు చేశారని చెప్పారు. డబ్బులు పంచినోళ్లే మళ్లీ బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.. గుజరాత్‌ పైసలు ఎన్ని వచ్చినా.. కేసీఆర్‌నే ముఖ్యమంత్రిని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దిశానిర్దేశం చేసిందన్న కేటీఆర్.. సెస్‌లో గెలువలేనోడు రాష్ట్రంలో గెలుస్తారా? అని ప్రశ్నించారు.. ఇక, మొన్న చూసింది ట్రైలరే.. 2023లో అసలు సినిమా చూపిస్తాం అని ప్రకటించారు..

Read Also: Anti-Govt Protests: పోలీసుల కాల్పుల్లో 17 మంది పౌరులు దుర్మరణం

సెస్ ఎన్నికల్లో పాలక వర్గాన్ని నామినేట్ చేస్తే కోర్టుకి పోయారు.. ఏమైంది విపు పగిలింది కదా? అని ఎద్దేవా చేశారు.. బీజేపీ నాయకులను, కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్న మీరు మొన్న చూసింది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా 2023 లో చూడండి అని హెచ్చరించారు.. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే యువతను దూరం చేస్తున్నారు అని బండి సంజయ్‌ అంటున్నారని ఫైర్‌ అయ్యారు.. ఏం చేసిన బీజేపీ దారుణం చేస్తున్నారు అంటున్నారు.. బీజేపీకి దమ్ముంటే మంచి పనులు చేయండి అని సవాల్‌ విసిరారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ఎవరికి దేవుడు..? నీకా? గుజరాత్‌ కా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నిలదీశారు కేటీఆర్…పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినోడని, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోడు దేవుడట.. చేనేత మీద పన్నువేసినోడు దేవుడా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

ఇక, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతూ.. ఆర్టీసీ ధరలు పెంచొద్దంటారని.. మరి బస్సులు ఎలా నడుపమంటారని ఫైర్‌ అయ్యారు మంత్రి కేటీఆర్.. కేంద్ర ధరలు పెంచడంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తుందన్న కేటీఆర్‌.. ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రాల గొడవ పరిష్కరించని ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆపారా? అని సెటైర్లు వేశారు.. 14 మంది ప్రధానులు చేసిన అప్పు.. మోడీ ఒక్కరే చేశారని విమర్శించారు. కిషన్‌రెడ్డి కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచారని విమర్శించిన కేటీఆర్‌.. తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో మరోసారి బహిరంగ సవాల్‌ విసిరారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.1.68లక్షల కోట్లు వెళ్లాయని.. కానీ, కేంద్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్‌ చేశారు మంత్రి కేటీఆర్. గుజరాత్ వాళ్లు వస్తే చెప్పులు నెత్తిమీద పెట్టు కోవడం తప్ప.. మరేమీ చేయలేరు.. కరీంనగర్ కు, వేములవాడ రాజన్నకు ఒక్క రూపాయి కూడా మోడీ ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్..

Show comments