NTV Telugu Site icon

Minister KTR: బీజేపీలో మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ రకాలు

Ktr

Ktr

Minister KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్, ఎంబీబీఎస్‌లు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వారి నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు ఉన్నారని ఆరోపిస్తూ.. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు. వీరి వద్ద రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని చెబుతున్నారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల్లో గెలవడం నేరం కాదా? అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. వాటిని పరిశీలించి దోషులుగా తేలితే అనర్హులు అవుతారా? అని లోక్ సభ స్పీకర్ ప్రశ్నించారు.

కాగా, డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో ప్రధాని మోదీ టార్గెట్ అంటూ బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యస్త్రాలు వేస్తున్నారు. నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను పూణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశానని తెలిపారు. మరోవైపు భారతదేశంలో నిజమైన డిగ్రీలు చదివిన వారికి ఉద్యోగాలు రావడం లేదని బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. డిగ్రీలు లేని వారికి ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయంటూ కవిత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్ సంచలనంగా మారింది.
Attar shops in Hyderabad: రంజాన్ మాసం.. భారీగా వెలసిన అత్తర్ విక్రయాలు

Show comments