NTV Telugu Site icon

Minister KTR: మహిళా పారిశ్రామికవేత్తల ప్రశ్నలు.. కేటీఆర్ సమాధానాలు

Minister Ktr

Minister Ktr

Minister KTR: మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రం అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హోట‌ల్ తాజ్ కృష్ణా వేదిక‌గా వీ హ‌బ్ 5వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజం అయిన ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు విహబ్ పారిశ్రామిక వేత్తలను అభినందించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణలో లక్షలాది మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుందని తెలిపారు. మహిళలకు ఉపయోగ పడే విధంగా స్త్రీ నిధి ఏర్పాటు చేసామని గుర్తు చేశారు. విదేశీ కంపెనీలతో కలిసి పని చేస్తున్నారు విహబ్ పారిశ్రామికవేత్తలు అన్నారు. 27వేల మంది ఆశా వర్కర్స్ ఉన్నారు. విహబ్ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన చీరలు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలో ఎంతో మంది యువతులు ఉన్నారు. వారంతా ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కోరుకుంటారని తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తలు ఎందుకు కాకూడదని, రాష్ట్రంలో ఎన్నో ఇండస్ట్రీ పార్కుల్లో మహిళలకు ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు.

Read also: Minister Jagadish Reddy: మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయ్.. కుట్రలో భాగంగానే కవితకు నోటీసులు

ఆడపిల్ల అయిన, మగ పిల్లలు అయినా సమానమే అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన రెండు కరోనా వ్యాక్సిన్లు మహిళల సారధ్యంలో ఉన్న కంపెనీలవే అని గుర్తు చేశారు. మండల స్థాయి నుంచి మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయాలని కోరారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సింగిల్ విండో సిస్టమ్ ను త్వరలో తీసుకు వస్తామన్నారు. ఐదేళ్లలో ఐదు వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలు విహబ్ ద్వారా వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపారం అన్నప్పుడు అది చిన్నదా, పెద్దదా అని కాదన్నారు. సంపద సృష్టించామా.. ఉద్యోగాలు సృష్టించామా అనేది చూడాలని తెలిపారు. ప్రపంచం గర్వించేలా తెలంగాణ నుంచి ఉత్పత్తులు సృష్టిస్తారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం చాలా మంది అనాగరికంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పాలి. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ప్రభావం చూపుతుంది. పిల్లలను ఎలా పెంచుతాం అన్నదే ముఖ్యమని చెప్పారు. తల్లిదండ్రులు ఆడపిల్లలు, అబ్బాయిల మధ్య తారతమ్యం చూపకూడదు. మన ఇంటి నుంచే సమానత్వం ప్రారంభమైతే మిగతా అమ్మాయిలు, అబ్బాయిలను కూడా సమానంగా, గౌరవంగా చూస్తారని కేటీఆర్ అన్నారు.
Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్

Show comments