Site icon NTV Telugu

Minister KTR : బండి సంజయ్‌కి బహిరంగ లేఖ

Ktr Bandi

Ktr Bandi

Telangana IT Minister K. Taraka Rao Wrote Letter To Telangana BJP Chief, MP Bandi Sanjay over Text Tile Devolopment.

నేతన్నల సంక్షేమం పైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఉన్నడూ లేనంత భారీగా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం మాదని మంత్రి కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో ఏక్కడా లేని విధంగా నేత్నన్నలకు యార్న్ సబ్సీడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం మాదని, ప్రత్యేక పొదుపు పథకంలో నేతన్నకు చేయూత నిస్తున్నది మా ప్రభుత్వమని ఆయన అన్నారు. మా ప్రభుత్వం వచ్చినాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

ముంబై, భీవండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా అని ఆయన అన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగినా చెబుతారని, నేతన్నలకు ఉన్న బీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై బండి మాట్లాడాలన్నారు. కేంద్రం బీమా ఎత్తేస్తే… మేము ప్రత్యేక నేతన్నకు బీమా కల్పిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి కేంద్రం నుంచి అందిన సాయంపై బండి సమాధానం చెప్పాలన్నారు. నేతన్నలపై నిజమైన ప్రేమ బండి సంజయ్‌కు ఉంటే పార్లమెంట్‌లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.

 

Exit mobile version