NTV Telugu Site icon

Minister KTR: ఖిలావరంగల్ లో కేటీఆర్.. ఐడీఓసీ నిర్మాణానికి శంకుస్థాపన

Ktr Minister

Ktr Minister

Minister KTR: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటలో గల కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్‌ కంపెనీ ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం పార్కులో టెక్స్ టైల్ పరిశ్రమలు నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ పాల్గొన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో టెక్స్‌టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి, యంగ్‌గోన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీకి టీఎస్‌ఐఐసీ ఇటీవల 298 ఎకరాలు కేటాయించింది.

Read also: Prabhas: పాన్ ఇండియా రూలర్!

దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ కంపెనీ తన టెక్స్‌టైల్ పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీ రూ.840 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలావరంగల్ వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అజంజాహీ మిల్స్ గ్రౌండ్‌లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దేశాయిపేటలో రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో చేపట్టిన 16 స్మార్ట్ రోడ్లను కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆజంజాహి మిల్స్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు.
PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్