NTV Telugu Site icon

Minister KTR: మరో రెండేళ్లలో ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు: కేటీఆర్

Metro Train

Metro Train

Minister KTR Says Metro Rail for Hyderabad Airport: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ఉదయం నార్సింగి ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గ్రేటర్‌ చుట్టూ 158 కిమీ మేర ఉన్న ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్‌ చేంజ్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడింటిని ప్లాన్ చేశారు. నార్సింగి, కోకాపేట నియో పొలీస్‌, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ముందుగా నార్సింగి ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నారు.

నార్సింగి ఇంటర్ చేంజ్ నిర్మాణం వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల ప్రయాణికులు ఓఆర్ఆర్ మీదుగా వారి గమ్యస్థానానికి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. అలాగే లంగర్ హౌస్, శంకర్ పల్లి నుంచి వచ్చే వారికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంతో సులువుగా ఉంటుంది. నార్సింగి ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ‘ఔటర్ రింగ్ రోడ్డుపై ఇది 20వ ఇంటర్ చేంజ్. డిసెంబర్ నెలలో మరొకటి అందుబాటులోకి వస్తుంది. సర్వీస్ రోడ్డులను విస్తరించాలని సీఎం చెప్పారు. ఔటర్‌పై రోడ్లు బావున్నాయి కాబట్టి 100 నుంచి 120కి స్పీడ్ పెంచాము. రాబోయే 2 ఏళ్లలో ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు వస్తుంది’ అని అన్నారు.

Also Read: Bacteria Effect: స్మార్ట్ ఫోన్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.. ఆ తరువాత స్థానం కీ బోర్డుది

‘కరోనా వల్ల మూసి సుందరీకరణ చేయలేకపోయాము. మూసి మీద ఔటర్‌ లాగానే ఎక్స్ప్రెస్ వే కట్టాలని ఆలోచన చేస్తున్నాం. పది వేల కోట్లతో మూసి మీద 14 బ్రిడ్జిలు, స్కై వేలు నిర్మిస్తాం. మెట్రో రైల్‌ను విస్తరణ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. బీహెచ్ఈఎల్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో తీసుకురాబోతున్నాం. ఇండియాలో ఎక్కడలేని విదంగా మురికి నీరు శుద్ది చేయబోతున్నాం. మొదటి ప్లాంట్‌ను కోకపేటలో ప్రారంభిస్తున్నాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

‘ఢిల్లీకి వెళ్లి కేంద్రాకి కొన్ని విజ్ఞప్తులు చేసాం. మెహదీపట్నంలో స్కై వాక్ ఏర్పాటు చేయాలని మొదలు పెట్టాం. పక్కనే ఉన్న ఆర్మీ భూములు అవసరం ఉన్నాయి. ఆ భూములపై కేంద్ర మంత్రిని అడిగాం. కొత్త లింక్ రోడ్స్ కావాలన్నాం. ప్రధాన మంత్రి రాష్ట్రానికి రబోతున్నారని తెలిసింది. ఆ లోపే భూములు కేటాయించండని కోరాం. తొమ్మిది ఏళ్లుగా సతాయిస్తున్నారు.. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయకండని విజ్ఞప్తి చేశాం. కోవిడ్ వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయి. లక్ష కోట్ల నష్టం వచ్చింది. ఆగస్ట్ 15 వరకు ఔటర్ చుట్టూ సైకిల్ ట్రాక్ ప్రారంభిస్తాం’ అని మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

Also Read: SS Rajamouli ISBC: ఐఎస్‌బీసీ చైర్మన్‌గా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి!