భాగ్యనగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్‌డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్‌డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్‌పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని.. ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే కాకుండా కేసులు పెడతా అంటున్నాడన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే.. కంటోన్మెంట్‌లో ఫ్లై ఓవర్‌లు కట్టించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌తో కూకట్‌పల్లి, హైటెక్ సిటీల మధ్య సాపీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సనత్‌నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలో మీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది.
Rahul Dravid: రిషభ్ పంత్ కెప్టెన్సీపై అప్పుడే లెక్కలేస్తే ఎలా?
