NTV Telugu Site icon

దేశంలోనే తొలిసారి.. మొబైల్ ఐసీయూ బ‌స్సులు ప్రారంభం..

Mobile ICU Buses

తెలంగాణ‌లోని మారుమూల ప్రాంతాల్లో సైతం క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందించ‌డానికి ప్ర‌త్యేక మొబైల్ యూనిట్ల‌ను సిద్ధం చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.. మొద‌టి విడ‌త‌లో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైద‌రాబాద్‌లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొద‌టి ద‌శ‌లో జిల్లాకు ఒక‌బ‌స్సును కేటాయిస్తున్నామ‌న్న మంత్రి.. త్వ‌ర‌లో జిల్లాకు రెండు బ‌స్సుల చొప్పున పంపిస్తామ‌న్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవ‌లు అందించ‌డం మొద‌టిసారి అని వెల్ల‌డించారు. ఇక‌, వైద్యుల‌ను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి.. ప్రజలకు సేవ చేయాల‌న్నారు మంత్రి కేటీఆర్. ఈ మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయ‌ని.. మారుమూల ప్రాంతాల్లో ఇవి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌న్నారు. ఈ బ‌స్సుల్లో 10 ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, డెడికేటెడ్ మానిటరింగ్ సిస్టమ్, లైవ్ ఇంటరాక్షన్ అండ్ క్యాప్చర్ కోసం సిసిటివి మ‌రియు వీడియో, డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మరియు వార్డు బాయ్‌, ‌టెక్నీషియన్స్‌కు కూడా ఏర్పాట్లు చేశారు.