Site icon NTV Telugu

Minister KTR : కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవాక్కులు చెవాక్కలు పేలుతున్నారు

Ktr

Ktr

సూర్యాపేట జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. 24గంటల కరెంట్ పై కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవాక్కులు చెవాక్కలు పేలుతున్నారని, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లు పట్టుకొండి కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది… దేశానికి దరిద్రం కూడా పోతుందంటూ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. 150 ఏళ్ల కిత్రం పుట్టిన కాంగ్రెస్ పార్టీకీ వారంటీ లేదని, వారంటి లేని పార్టీ గ్యారంటీ లేని హామీలు ఇస్తుందంటూ మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. అధికారం కాంగ్రెస్ పార్టీదీ దింపుగుడు కళ్లెం ఆశమాత్రమేనని, అధికారంలో ఉన్నప్పుడు 200రూపాయల పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్… ఇప్పుడు 4వేలు ఎలా ఇస్తారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read : Revanth Reddy: బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదు.. రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

11సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజల పడిన ఇబ్బందులు, బాధలు ఇంకా గుర్తే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే గొర్రెల మందకు తొడేలును కాపాలా పెట్టినట్లేనని ఆయన అభివర్ణించారు. ఓటుకు నోటుకు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ చెప్తున్న మాటలు ప్రజలు నమ్మరని, వేలం పాట పెట్టీ మరీ సీట్లు అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్‌. కేసీఆర్ ది బరాబర్ కుటుంబాపాలనే… కేసీఆర్ నాలుగున్నర కొట్ల ప్రజలకు కుటుంబపెద్ద పెద్ద కేసీఆర్ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీదీ బరాబర్ వారసత్వ రాజకీయమే.. రాణిరుద్రమ, కొమరం బీమ్, సర్వాయిపాపన్న, దాశరధి, కాళోజీ, భాగ్యరెడ్డి, శ్రీకాంతాచారీల వారసత్వం మాది అని ఆయన అన్నారను. ప్రధాని నరేంద్ర మోడీది గాడ్సే వారసత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో గుంతకండ్ల జగదీష్ రెడ్డి విజయం ఖాయమని, రెండు సార్లు స్వల్ప మెజారీటీతో జగదీష్‌ రెడ్డిని గెలిపించారు… ఈసారి 50వేల మెజారీటీతో జగదీష్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్‌ ప్రజలను కోరారు.

Also Read : Name Nageswara Rao: కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..

Exit mobile version