Minister KTR Fires On Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో ఎంపీగా ఏం చేశావని ప్రశ్నించారు. కనీసం ఒక చిన్న పాఠశాలనైనా తీసుకొచ్చావా? అంటూ నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా.. కేటీఆర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో ఆత్మీయ సభలో ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది? విద్యావ్యవస్థలో ఇలా మార్పు వస్తుందని, సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుందని అనుకున్నామా? అని అడిగారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడా? తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని దౌర్భాగ్యపు ప్రధాని ఎక్కడా? అని విరుచుకుపడ్డారు.
BoyapatiRAPO: బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే
ప్రధాని మోడీ ఒక్క మెడికల్ కాలేజీ గానీ, నర్సింగ్ కాలేజీ గానీ, నవోదయ పాఠశాల గానీ, కస్తూర్బా గానీ ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇంతకుముందు కరీంనగర్‌కు ట్రీపుల్ ఐటీ వచ్చినట్టే వచ్చి ఎత్తిపోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటప్పుడు విద్యార్థులు ఎవరిపై కొట్లాడాలి? అని నిలదీశారు. మనం ఏం చేస్తున్నామో కొద్దిగా అయినా సోయి ఉండాలని సూచించారు. రాష్ట్రానికి వ్యవయాస కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, జేఎన్టీయూ కాలేజీ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై నలుగురు పిల్లలను ఉసిగొల్పి అడ్డం పంపడం న్యాయమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే ప్రధాని మోడీ, బండి సంజయ్‌లపై దాడి చేయాలని అన్నారు. నాలుగేళ్లు అయినా, ఎంపీగా ఏం చేశావని బండి సంజయ్‌ను గల్లా పట్టి నిలదీయాలన్నారు. ఏం చేశావని గట్టిగా అడిగితే బండి సంజయ్ మౌనం పాటిస్తారని.. అనవసరంగా అడ్డం పొడువు మాటలు మాత్రం మాట్లాడుతారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ తన పనే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tammineni Veerabhadram: రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు మద్దతిస్తాం
అంతకుమించిన దారుణమైన విషయం ఏమిటంటే.. సీఎం కేసీఆర్‌ని పట్టుకొని బండి సంజయ్ బ్రోకర్ అంటున్నాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తలచుకుంటే తాను కూడా ప్రధాని మోడీని బ్రోకర్ అనగలనని.. కానీ తనకు సంస్కారం ఉంది కాబట్టి అలా చెప్పనని స్పష్టం చేశారు. తాను సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చానని.. మరి బండి సంజయ్ కనీసం చిన్న పాఠశాలనైనా తీసుకొచ్చాడా? అని నిలదీశారు. అసలు నువ్వు చేసింది ఏమైనా ఉందా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. రేవేంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల మాటలు వింటుంటే.. అసలు వీళ్లు జీవితంలో ఒక్క పరీక్షనైనా రాశారో లేదో అనుమానంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ ఫేక్ డిగ్రీ పెట్టి దొరికిపోయాడని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి అయితే కొవిడ్ సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచాడని, అసలు వీళ్లు ఇజ్జత్ మానం ఉన్నోళ్లేనా? అంటూ కేటీఆర్ చురకలంటించారు.