తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ మంత్రులు వినతి పత్రం అందజేశారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి ఒక పనికి మాలిన మంత్రి.. బండి సంజయ్ ఒక దౌర్భాగ్యడు అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పీయూష్ గోయల్ ది కండకవరమని, బీజేపీ నాయకుల అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4 న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 6 నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధమని, నాగపూర్, బెంగుళూరు,ముంబయి,విజయవాడ జాతీయ రహదారుల దిగ్బంధించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 7 న 32 జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
