Site icon NTV Telugu

KTR is Angry: నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఎందుకు.. అధికారులపై కేటీఆర్ ఫైర్

Ktr Iiit

Ktr Iiit

KTR fires on IIIT officials: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి. మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత మంది మంత్రులు, అధికారులు ఉండి కాంట్రాక్టర్లను మార్చక పోవడం ఏమిటని వీసీ ని నిలదీశారు. ఇది సిల్లీ ఇష్యూ..నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనమంతా ఉన్నదెందుకన్నారు కేటీఆర్‌. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయండని ఆదేశించారు. టీ.హబ్ ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Read also: GVL Narasimha Rao: జీవీఎల్‌కి తృటిలో తప్పిన ప్రమాదం.. కుమ్మేందుకు ప్రయత్నించిన ఆవు

నేను మళ్లీ వస్తా అప్పటిలోగా అన్నీ పూర్తి కావాలని అన్నారు మంత్రి కేటీఆర్‌. అనంతరం విద్యార్థులకు మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి లాప్ టాప్ లు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలు ప్రకారం ట్రిపుల్ ఐటీ లో ల్యాప్ ట్యాప్ లు అందజేశామన్నారు మంత్రి కేటీఆర్‌. 2500 ల్యాప్ ట్యాప్ వచ్చాయని, P1, P2 వారికి డెస్క్ టాప్ లు వచ్చాయన్నారు, బాసర ట్రిపుల్ ఐటి కి మిషన్ భగీరథ నీరు అందిస్తామని తెలిపారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటు కు 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీ లోని చెరువు సుందరీకరణ చేపిస్తామని హామీ ఇచ్చారు. సోలార్ విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జీ వీసీని పంపించండని, క్యాబినెట్ ఉన్నా కేసీఆర్ మమ్మల్ని పంపించారని అన్నారు. ట్రిపుల్ ఐటీలో 10 బెడ్స్, ఆసుపత్రికి ఏర్పాటుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి సబితా పేర్కొన్నారు.
Throat Cut: నార్సింగీ లో దారుణం.. గొంతుకోసి హత్య

Exit mobile version