KTR Criticized PM Modi Speech: ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్ వేదికగా ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. భారత 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై విమర్శల వర్షం కురిపించారు కేటీఆర్. మోడీ గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాలు నెరవేర్చలేదని, కొత్తగా మరికొన్ని నిదర్ధేశాలు చెబుతున్నారని ఎద్దేవ చేసారు. ఇప్పటివరకు చెప్పినవి చేయకుండా మళ్లీ కొత్త లక్ష్యాలు గురించి చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
నిన్న సోమవారం (ఆగస్టు 15,2022) ఎర్రకోట వేదికగా 2047 కోసం ప్రధాని మోడీ తన ప్రసంగంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. అయితే.. రానున్న 25 ఏళ్లలో ఆలక్ష్యాలను అందుకోవాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. ప్రధాని ప్రసంగంపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్ ప్రధాని నిర్ధేశించిన ఆ లక్ష్యాలు గొప్పగానే ఉన్నాయి.. కానీ గతంలో ఇచ్చిన లక్ష్యాల మాట ఏంటీ అంటూ ప్రశ్నించారు.
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
గతంలో మోడీ ప్రసంగాలు:
2022 నాటికి ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు?
భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల డాలర్లుగా మారుస్తామన్నారు?
ప్రతి ఇంటికీ కరెంటు సరఫరా చేస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేశారు. కానీ.. వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ తన ట్విటర్ వేదికగా ఆరోపించారు. మీరు చెప్పిన మీ నిర్ధేశించిన లక్ష్యాలను మీరు గుర్తించలేనప్పుడు జవాబుదారీతనం ఎక్కడ ఉంటుంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
New goals for 2047 is great. But what about your past promises for 15th August, 2022 Hon’ble PM @narendramodi Ji?
Nation wants to Know
Where is the accountability if you don’t even acknowledge your own targets & subsequent failures in accomplishing the same?#KyaHuaTeraWada pic.twitter.com/P2YaL6GYs2
— KTR (@KTRTRS) August 16, 2022
తాజావార్తలు
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!