Site icon NTV Telugu

Minister KTR : అమిత్‌ షా కాదు.. అబద్దాల బాద్‌ షా..

Minister Ktr

Minister Ktr

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిన్న హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా అమిత్‌షా కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు మీడియా సమావేశం నిర్వహించి అమిత్‌ షా వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చారు. మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తోందని ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా… గాలి మోటర్లో వచ్చి.. గాలి మాటలు చెప్పడం అనవాయితీగా మారిపోయిందన్నారు.

స్థానిక పరిస్థితులపై అవగాహన లేకుండా.. ఇక్కడికి వచ్చి.. ఇక్కడి నాయకులు రాసిచ్చిన మాటలు చెప్పడమే గానీ.. అందులో వాస్థవాలు పట్టించుకోవడం లేదన్నారు. నిన్న అమిత్‌ షా మాట్లాడిన మాటలన్నీ అబద్దాలేనని, ఆయన అర్జెంట్‌గా అమిత్‌ షాకు బదులు.. అబద్దాల బాద్‌ షా అని పేరు మార్చుకొవానలి కేటీఆర్‌ సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యర్థి హోదా లేదని, గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదన్న కేటీఆర్‌.. కేంద్రం నుంచి వచ్చి మాట్లాడిన అమిత్‌ షా వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

Exit mobile version