Minister KTR: హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Read Also: Delhi Mayor Election: ఫిబ్రవరి 16 ఢిల్లీ మేయర్ ఎన్నిక.. మేయర్ పీఠం కోసం బీజేపీ-ఆప్ ఫైట్
హైదరాబాద్ లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో ఉందిన.. గతంలో మెట్రో మొత్తం పీపీపీతో నడిచిందని.. ఇప్పుడు రహేజ ఐటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది రాష్ట్రప్రభుత్వమే చేపడుతున్న ప్రాజెక్ట్ అని వెల్లడించారు. చాలా మంది కరోనా తర్వాత రవాణా కష్టాలు పడ్డారని అన్నారు. ఎయిర్ పోర్టు మెట్రలో ఎవరైనా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడుతామని వెల్లడించారు.
ఓల్డ్ సిటీకి మెట్రోకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించామని.. కేంద్రం కనీసం తెలంగాణపై కనికరం చూపెట్టడం లేదని ఆరోపించారు. ముంబై, గుజరాత్, తమిళనాడులో మెట్రోకు నిధులు ఇచ్చారు..కానీ తెలంగాణకు పైసా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర డబ్బులు ఇచ్చిన ఇవ్వకున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకు వెళ్తాం అని అన్నారు. ఇక ఛార్జీలు పెంపు చేయము అని ప్రకటించారు. మాకు చెప్పకుండా ఛార్జీలు పెంచొద్దని మెట్రో అధికారులకు చెప్పామని వెల్లడించారు. ఆర్టీసీ తరహాలో ఛార్జీలు అందుబాటులో ఉండాలని చెప్పామన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో పొడగింపు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మళ్లీ రాష్ట్రానికి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని.. మిగతా మెట్రో పనులు కూడా చేపట్టి పూర్తి చేస్తామని వెల్లడించారు.