Site icon NTV Telugu

Minister KTR : కాంగ్రెస్‌ అసలు పేరు ‘స్కాం’గ్రెస్‌..

Ktr

Ktr

తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో తెలంగాణకు వచ్చారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో రిమోట్‌ జరగడం లేదని.. మీ కాంగ్రెస్‌ది రిమోట్‌ పాలన అని కేటీఆర్‌ మండిపడ్డారు. మీరు చెప్పినవన్నీ నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, ఇక్కడి ప్రజలకు అన్ని అంశాల పైనా అవగాహన ఉందన్నారు.

కాంగ్రెస్‌ అసలు పేరు ‘స్కాం’ గ్రెస్‌ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రజలు మీకు 10 ఛాన్సు ఇచ్చారని, ఒక్క ఛాన్స్ అని విచిత్ర మాటలు రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. మమ్మి గారి పాలనలో డమ్మీ గారి తో పాలన చేసింది మీరని, ఆ నాడు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చించేసిన మీరు రిమోట్ కంట్రోల్ పాలన గురించి మాట్లాడడం విడ్డురమన్నారు.

Exit mobile version