Minister Jupally Krishna Rao: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి… లేదంటే పరువు నష్టం దావా వేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. ఓ యువరాజు, మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టని తిట్టు తిట్టిన ఆర్ఎస్ పీ కేసీఆర్ పంచన చేరారని మండిపడ్డారు. చనిపోయిన శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడు కాదన్నారు. హత్య బాధాకరం అన్నారు. కేటీఆర్.. నిన్న ఏం జరిగిందో పూర్తి వివరాలు రానివ్వండి అన్నారు. మళ్ళీ నాపై ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. రాజకీయంగా వాడుకోవడం కోసం నాపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి ఎలాంటోదో ఊరికి వెళ్లి అడగండని తెలిపారు. ఆయన ప్రవర్తనతో.. ఊరు కూడా విసుగు ఎత్తిందన్నారు. కానీ హత్య తప్పన్నారు. నేను బీఆర్ఎస్ వ్యతిరేకించానని కసితో.. నాపై దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటూ మండిపడ్డారు. ఎప్ఐఆర్ లో భూముల వివాదం ఉందని.. అన్నదమ్ముల పంచాయతీకి నాకేం సంబంధం లేదన్నారు. Fir కాపీలను .. ఆర్ఎస్ పి కి పంపిస్తా కేటీఆర్ అని జూపల్లి అన్నారు.
Read also: Love Marriage: ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడిపై యువతి పేరెంట్స్ దాడి..
మా కార్యకర్తను కూడా చంపారన్నారు. నీలాగే నేను ఆరోపణలు చేయలేదన్నారు. బట్టకాల్చి మీద వేస్తాం అంటే ఏం రాజకీయం చేస్తున్నట్టు అన్నారు. నెరేళ్లలో దళితులని ఇసుక అక్రమ దందా అపారని కేటీఆర్ ఎంత హింస పెట్టారో అందరికి తెలుసన్నారు. అలాంటి వ్యక్తి.. నా పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. రాజకీయంగా ఎలాంటి అంశం లేదని ఏదేదో ఆరోపణలు చేస్తున్నాడన్నారు. కేటీఆర్.. గండ్రపల్లి ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుద్ది జ్ఞానం ఉండాలన్నారు. చదివిన చదువుకు సంస్కారం ఉండాలి కేటీఆర్ అంటూ మండిపడ్డారు. సీబీఐ విచారణతో కాకుంటే.. జ్యూడిషియల్ విచారణ కు కూడా సిద్ధం అన్నారు. మీకు దమ్ముంటే ఆ గ్రామంలోకి వచ్చి ప్రజలను అడుగు.. నిజం తెలుసుకో అంటూ సవాల్ విసిరారు. గ్రామంలో ప్రజలను అడుగుదాం.. బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నావు అంటూ మండిపడ్డారు.
Kunamneni Sambasiva Rao: బీజేపీ త్రాచుపాము లాంటిది.. తలలోనే కాదు తోకలోనూ విషం ఉంది!