Site icon NTV Telugu

Jagadish Reddy: రాజగోపాల్‌ రెడ్డికి మూడో స్థానం ఖాయం

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బీజేపీ పంచన చేరాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న ఆయన.. అభివృద్ధి కోసమే వారు గులాబీ పార్టీలోకి వచ్చారన్నారు. కాంట్రాక్టులు ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తా అన్నది నువ్వే అంటూ మంత్రి విమర్శించారు. నువ్వు దొంగవు.. ప్రజా ద్రోహివి.. నీ స్వార్థం కోసమే రాజకీయాలు అంటూ ధ్వజమెత్తారు. దొంగలకు, ద్రోహులకు, గుత్తేదారులకు… మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదంటూ మంత్రి పేర్కొన్నారు.

Srinivas Goud Rifle Issue: ఎస్పీ వివరణ.. అందులో బుల్లెట్, పెట్లెట్ ఏదీ లేదు

రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానమే ఖాయమంటూ ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను వద్దంటున్న బీజేపీలో చేరావని.. రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నీ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదంటూ విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న మోడీపై అన్ని విషయాలను సభ ద్వారా కేసీఆర్ వివరిస్తారన్నారు. అన్ని మండలాల్లో గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధం అవుతున్నారన్నారు. మునుగోడు సభతోనే ఇక్కడ ప్రజల అభిప్రాయం స్పష్టం కానుందన్నారు.

Exit mobile version