Site icon NTV Telugu

దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ : మంత్రి జగదీష్‌రెడ్డి

Jagadish Reddy

Jagadish Reddy

ఈ నెల 12వ తేదీన భువనగిరిలో జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశo నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే, భాస్కర్ రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎదో రాజకీయ నాయకుడిలాగా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు తెచ్చే అలవాటు కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. ఏదైనా పని మొదలు పెడితే జరిగి తీరాలే.. మార్పు తేవాలే, ప్రజల జీవితాలతో మార్పు తెచ్చి తీరాలే అని ఆయన అన్నారు. భారత ప్రధాని మోదీ తెలంగాణ మీద విషం కక్కుతుండని ఆయన విమర్శించారు. తెలంగాణ రాకుంటే కేసీఆర్ లేకుండే.. అనే భయం తో మోడీ మాట్లాడుతుండు అని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి అభివృద్ధి చెందిందని, దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణను చేసి చూపించిండు కేసీఆర్‌ అని ఆయన వెల్లడించారు. వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ అని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ పార్లమెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ అప్రజాస్వామికంగా ఇచ్చారు.. పార్లమెంట్ మైక్ బంద్ చేసి ఇచ్చారు అంటూ తెలంగాణ మీద విషం కక్కుతుండు మోడీ అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను పొగుడుతూ మాట్లాడిన వాళ్లే.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఇష్టం లేకుండా మాట్లాడుతుండు ఆని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version