NTV Telugu Site icon

Minister Jagadish Reddy : రైతాంగానికి సమృద్ధిగా నీరు, విద్యుత్‌

కేంద్రంలో మధర్‌ థెరిస్సా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్‌ మండలంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. సమృష్టి వ్యవసాయ అభివృద్ధిపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన నీరు, విద్యుత్‌ను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందన్నారు.

రైతాంగం అధిక ఆదాయం వచ్చే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, భూసారం కాపడడంపై దృష్టి పెట్టడంతో పాటు అధిక దిగుబడులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తి కేంద్రాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 324 రైతు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా.. సూర్యాపేట జిల్లాలో నాలుగు ఉన్నాయని అందులో ఆత్మకూరులో రెండు సంఘాలు కోటి 60 లక్షల రూపాయల మేర వ్యాపారం చేయడం స్వాగతించదగ్గ అంశమన్నారు.