NTV Telugu Site icon

Kadem Project: డేంజర్ జోన్‌లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister Indrakaran Reddy

Minister Indrakaran Reddy

Minister Indrakaran Reddy inspected the Kadem project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఉంది. వరద ఉధృతి పెరగడంతో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగు గేట్లు తెరుచుకోవడం లేదు. వరద నీరు పొంగి పొర్లడంతో కాడే ప్రాజెక్టు ఫుల్‌ ట్యాంక్‌గా మారింది. ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్‌ఫ్లో చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే. గేట్ల పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో నిన్నటి నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. కడెం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిన్న 12 గ్రామాలను ఖాళీ చేయించారు.

Read also: No-Confidence Motions: నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..

కడెంలో ఐదు గ్రామాలు, దత్తులో ఏడు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. నిర్మల్ కలెక్టర్ మాట్లాడుతూ వారికి అన్ని రకాల సౌకర్యాలు, ఆహారం, నీరు, పాలు అందించామన్నారు. ఎమ్మెల్యే రేఖా రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గేట్ల పై నుంచి నీళ్లు వస్తున్నాయని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వరద ఉధృతి కొంత తగ్గిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు.
Viral Snake Video: చెట్టు కిందపడుకుంటే చొక్కాలోకి దూరిన పాము.. అదృష్టం బాగుంది లేదంటే

Show comments