NTV Telugu Site icon

Indrakaran Reddy: రైతులు మంచిగా బ‌తుకుతుంటే.. కాంగ్రెస్‌కు క‌డుపుమంట‌గా ఉంది

Indrakaran Reddy

Indrakaran Reddy

Minister Indrakaran Reddy Fires On Congress Over Free Power Issue: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు మంచిగా బ‌తుకుతుంటే.. కాంగ్రెస్‌కు క‌డుపుమంట‌గా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు 3 గంట‌లు క‌రెంట్ చాలని అంటోందని గుర్తు చేశారు. నిర్మల్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ప్రజ‌లు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. గ‌తంలో లాగా క‌రెంట్ స‌మ‌స్యలు గానీ, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల స‌మ‌స్య గానీ లేదన్నారు. వ్యవ‌సాయానికి సాగునీరు, నిరంత‌ర నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు సంక్షేమ పథ‌కాలతో రాష్ట్ర రైత‌న్నల మోహంలో న‌వ్వు కనబడుతోందన్నారు.

V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు

వ్యవ‌సాయానికి 3 గంట‌ల క‌రెంట్ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసలు రైతు కష్టాలు రేవంత్‌కి ఏం తెలుసు? ఏనాడైనా అర‌క‌ప‌ట్టి దుక్కి దున్నిండా? అని ప్రశ్నించారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బషీర్‌బాగ్ వద్ద రైతులు ఆందోళన చేస్తే.. చంద్రబాబు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న శిష్యుడు రేవంత్ రెడ్డి ఉచిత క‌రెంట్ వద్దంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఎందుక‌న్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను గ్రామ పొలిమేర‌ల వ‌ర‌కు తరిమికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ హ‌యంలో కరెంట్ క‌ష్టాలు, అప్పుల బాధ‌లతో రైత‌న్న చితికిపోయాడని.. రైతన్నల ఆత్మహత్యలు కూడా చూశామని ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో వ్యవ‌సాయం లాభ‌సాటిగా మారిందని.. రైతు ఆత్మహ‌త్యలు లేవు, వలసలూ లేవని చెప్పారు. సాగునీరు, ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి సంక్షేమ ప‌థ‌కాల‌తో అన్నదాత‌లు ఆర్థిక‌వృద్ధి సాధించారన్నారు.

MP Margani Bharat: పవన్ కల్యాణ్‌ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్‌ చేస్తున్నాడు..

3 గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌న్న కాంగ్రెస్ పార్టీ కావాలా? 3 పంట‌ల‌కు సాగునీరు, క‌రెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో రైతులు నిర్ణయించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. అనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, ‘3 గంటలు వద్దు 3 పంటలు కావాలని’ కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించారు. ఇదే సమయంలో.. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్‌ని తొలగించాలమని తీర్మాణం చేస్తామని కూడా చెప్పారు. రైతుల్ని ముంచే వ్యక్తుల్ని పెట్టుకుంటారా? రాహుల్, సోనియా గాంధీలకు కళ్లు లేవా? అంటూ ధ్వజమెత్తారు.