Site icon NTV Telugu

Allola Indrakaran Reddy: సైకిల్ తొక్కిన మంత్రి…

Indrakaran

Indrakaran

సైక్లింగ్ కూడా పర్యావరణానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని. ఈ రోజుల్లో కూడా మంది సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. దీనిని ప్రోత్సహించడానికి ప్రపంచ సైకిల్ దినోత్సవం 2022 ను ప్రతి సంవత్సరం జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానికులతో కలిసి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 15 కిలోమీట‌ర్ల మేర సైకిల్ తొక్కి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్ సైక్లింగ్ దినోత్సవాన్ని 2018 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రతి రోజూ సైకిల్ తొక్కి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌న్నారు. పర్యావరణాన్ని కూడా సంరక్షించుకోవాలి మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్ తొక్కడం అలవాటు చేయాలని సూచించారు. పిల్లలకు మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఉల్లాసం కలుగుతుందని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు.

AP SSC Results : ఈ నెల 4న పదోతరతగతి ఫలితాలు..

Exit mobile version