Site icon NTV Telugu

Harish Rao: నారాయ‌ణ‌పేట‌లో ప‌ర్య‌ట‌న‌.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన

Haris Rao

Haris Rao

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు నారాయ‌ణ పేట జిల్లాలో ఇవాళ (సోమవారం) ప‌ర్య‌టించ‌నున్నారు. నారాయ‌ణ పేట జిల్లా కేంద్రంతో పాటు నారాయ‌ణ పేట మండ‌ల ప‌రిధి అప్ప‌క్ ప‌ల్లి గ్రామంలో రూ. 64కోట్ల 43 ల‌క్ష‌ల 19వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకుమంత్రి తన్నీరు హరీశ్‌ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు.

నారాయణపేట పట్టణం నుంచి ఎక్లాస్పూర్ మీదుగా తెలంగాణ కర్ణాటక సరిహద్దు వరకు రూ.5కోట్ల 98 లక్షల 19 వేల వ్యయంతో చేపట్టిన 5.5 కిలోమీటర్ల బి.టి. రోడ్డును, జిల్లా కేంద్రంలోని 100 బెడ్ మాడ్యులర్ చిల్డ్రన్ దవాఖానలో రూ. కోటి 25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించనున్నారు.

అక్కడి నుంచి బయలు దేరి నారాయణ పేట మండలం అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 390 పడకల జిల్లా దవాఖాన, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న టీ డయాగ్నొస్టిక్ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే లు రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, తదితరులు పాల్గొంటారు.

Secendeabad Crime: సామాన్యుడిపై ఖాకీల కర్కశత్వం.. కర్రలతో కాళ్లు విరగగొట్టి..

Exit mobile version