NTV Telugu Site icon

Harish Rao: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి..

Harish Rao

Harish Rao

Harish Rao: సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. 18 వార్డులో నడుస్తూ చెత్త తొలగిద్దాం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వార్డులో ఉన్న చెత్తను స్వయంగా తొలగిస్తూ అవగాహన కల్పించారు. చెత్త పేరుకుపోవడం వలన అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. ఇంటిని, ఇంటి ఆవరణ వాతావరణాన్ని శుభ్రాంగా ఉంచుకోవాలని సూచించారు. 18 వార్డులో నడుస్తూ అక్కడే ఉన్న ఓ కాలువలో చెత్త పేరుకుపోవడంతో అందులో వున్న కవర్లు, పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్లను స్వయంగా తన చేత్తో బయటకు తీశారు.

నిన్న జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 నిమిషాల దోమల నివారణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కోకాపేటలోని తన నివాసంలో మంత్రి హరీశ్ 10 నిమిషాల పాటు ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీరు, చెత్తను దోమల నివారణకు స్వయంగా శుభ్రం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు గడిపి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకుంటే నీరు చేరి దోమలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ దోమల నివారణకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

Read also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి చోట్ల నిలిచిన నీటిలో దోమల లార్వాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యం విషయంలో ‘చికిత్స కంటే ముందుజాగ్రత్త మేలు’ అని అందరూ గుర్తుంచుకోవాలి. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా వీలైనంత ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ, గ్రామ పంచాయతీల సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నారని.. మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. వర్షాకాలం కావడంతో ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సన్నద్ధమైందని, ప్రభుత్వాసుపత్రుల్లో టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో మందులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
Housing Sales: ప్రధాన నగరాల్లో పడిపోయిన చిన్న ఇళ్ల విక్రయాలు.. హైదరాబాద్‌లో మరీ దారుణం..!