NTV Telugu Site icon

Harish Rao: దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదు..!

Harish Rao

Harish Rao

Harish Rao: బంజరు భూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని అన్నారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాల గొంతు మూగబోయిందని, వారి గొంతు లేకుండా చేశారని విమర్శించారు. బయటే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనసభను 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించారనేది ముఖ్యం కాదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎన్ని పని గంటలు నిర్వహించడమనేది ముఖ్యమని గుర్తించాలని మంత్రి హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు.

Read also: Gyanvapi Mosque: జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ బెడ్ రూమ్ సమస్య తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యాక గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు విమర్శించారు. త్వరలో మీడియా సంస్థను ప్రారంభించి తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని వెల్లడించారు. ఏది జరిగినా అంతా మన మంచికే అని అన్నారు. మాడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారో తానే నిర్ణయిస్తానని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మల్లారెడ్డి కేఎల్‌ఆర్‌కు టిక్కెట్‌ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలకు కారణం వారేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Shweta Tiwari Saree Pics: హాట్ ఫోజులతో.. శారీలో సెగలు పుట్టిస్తున్న శ్వేతా తివారీ!

Show comments