NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణ వేరే వాళ్ల చేతికి పోతే ఆగం అవుతుంది

Harish Rao

Harish Rao

Minister Harish Rao Says Telangana Is Not Safe In Other Hands: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుందని.. వేరే వాళ్ళ చేతికి పోతే ఆగం అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పేదలు, రైతులు సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మునిపల్లి మండలం చిన్న చల్మెడ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పంపు హౌజ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంగమేశ్వర పథకానికి భూములు ఇచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో చాలామంది వస్తుంటారని అన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తి అయితే.. సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని పూర్తి చేసి, ఇక్కడి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.

Medico Preethi Case: మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో.. కోర్టుకి చార్జ్‌షీట్ సమర్పించిన పోలీసులు

నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్‌లు ఒకప్పుడు కరవు ప్రాంతాలని.. ఇప్పుడు రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లిస్తామని హరీష్ రావు అన్నారు. దీనిని పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతుందని.. రెండు పంటలు పండుతాయని అన్నారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. సింగూర్ నీళ్లు ఇక్కడి ప్రజల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామని అన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలన్న ఆయన.. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామని మాటిచ్చారు.

Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం

ఆనాటి ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో సింగూరు కట్టి, నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయిందని హరీష్ రావు గుర్తు చేశారు. భూములు మనవి పోతే, నీళ్లు వాళ్లు తీసుకుపోయారన్నారు. ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అని చెప్తే.. సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారని హరీష్ రావు పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందని, అంతేకాకుండా మద్దతు ధర కూడా ఇస్తుందని వెల్లడించారు. ఇదిలావుండగా.. సదాశివపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి పోర్టల్ గురించి స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒకప్పుడు ఇంట్లో వాళ్ల పేరు మీద భూమిని మార్పించాలంటే, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ ధరణి పోర్టల్ వచ్చాక ఆ కష్టాలు తగ్గాయని రైతులు చెప్పారు. ఈ పోర్టల్ తమకు మేలు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.