NTV Telugu Site icon

Hyderabad: హరీష్‌ రావు ట్వీట్‌కు బీజేపీ శ్రేణులు కౌంటర్‌

Bjp

Bjp

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌ పర్యటనపై.. ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వాన్ని ప్ర‌స్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హ‌రీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్ర‌తిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ న‌ర‌సింహ జ‌యంతిని ప్రస్తావిస్తూ హ‌రీశ్ రావుకు కౌంట‌ర్ వేసింది.

హిర‌ణ్య‌క‌శిపుడిని అంతం చేసేందుకు ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని, ఆ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌ర‌సింహ జ‌యంతిని జ‌రుపుకుంటున్నామ‌ని బీజేపీ తెలిపింది. న‌ర‌సింహ జ‌యంతి అంటే చెడుపై మంచి సాధించిన విజ‌యం అని కూడా తెలిపిన బీజేపీ.. అలా స‌రిగ్గా న‌ర‌సింహ జ‌యంతి నాడే తెలంగాణ‌లో అమిత్ షా ప‌ర్య‌టిస్తున్నార‌ని, తెలంగాణ‌లో కొన‌సాగుతున్న చెడును అంతం చేసేందుకే ఈ ప‌ర్య‌ట‌న సాగుతోంద‌న్న అర్థం వ‌చ్చేలా బీజేపీ స‌ద‌రు ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అయితే ఈ ట్విట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బీజేపీ ట్వీట్‌

డీకే అరుణ‌:

హరీశ్ రావు చేసిన ట్వీట్‌కు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ‘థ్యాంక్యూ హరీశ్ రావుజీ #AmitShahVisitsTelangana ట్విట్టర్ ట్రెండింగ్‌లో మీరూ పాల్గొన్నందుకు’ అని ఆమె ట్వీట్ చేశారు.

ధ‌ర్మపురి అరవింద్

హరీశ్ రావు చేసిన ట్వీట్‌కు పర్యావరణ సమతుల్యత & జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి వలస పక్షులు చాలా అవసరం !తెలంగాణలో అభివృద్ధిలో డొల్లతనానికి కారణమైన చెదపురుగులు, చీడపీడలు తినడానికి కూడా వస్తారు! ఇది సహ-సంఘటన కాదు, కానీ మానవజాతిని రక్షించడానికి ప్రకృతి చట్టం! అంటూ ధ‌ర్మపురి అరవింద్ ట్వీట్ చేసారు.