Site icon NTV Telugu

హరీష్‌రావు కీలక ఆదేశాలు.. ఆరోగ్య సూచిల్లో అగ్రస్థానంలో ఉంచాలి..

దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటూ కీలక సూచనలు చేశారు మంత్రి హరీష్‌రావు.. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణ‌ను అగ్రస్థానంలో ఉంచాల‌ని, ఆరోగ్య తెలంగాణ క‌ల సాకారం చేయాల‌ని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు పూనుకోవాలని ఆదేశించారు హరీష్‌రావు.. ఇక, విభాగాల వారీగా అధికారులు వారి పని తీరుపై సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించిన ఆయన.. ప్రతి నెల విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తాన్నారు.. పనితీరులో నెలవారీ వృద్ధి కనిపించాలని స్పష్టం చేసిన మంత్రి.. అదే పదోన్నతులు, ప్రోత్సాహకాలకు గీటురాయిగా పేర్కొన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి, రిపోర్టులు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు హరీష్‌రావు.

Read Also: కొత్త వేరియంట్‌ భయం… అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన

మలేరియా, డెంగ్యూ వంటి వెక్టర్ బోర్న్ రోగాల విషయంలో సంబంధిత జిల్లాలను అప్రమత్తం చేయాలి.. తగిన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు మంత్రి హరీష్‌రావు.. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తున్నదని, అదే స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో శ్రద్ద చూపించాలన్నారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగైన స్థితిలో ఉండాలి. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్‌ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలి.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. డిసెంబర్ నెలాఖరులోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్య్రక్రమాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్‌ రావు.

https://www.youtube.com/watch?v=iNMBi5n0pkE
Exit mobile version